తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు 28 వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ క్రిష్ణారావు ఫిబ్రవరి 15న ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 22.02.2023: పేపర్-1: ఛైల్డ్‌హుడ్, ఛైల్డ్ డెవలప్‌మెంట్ & లెర్నింగ్
➥ 23.02.2023: పేపర్-2: సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరికుల్లమ్
➥ 24.02.2023: పేపర్-3: ఎర్లీ ఛైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్
➥ 25.02.2023: పేపర్-4: అండర్ స్టాండింగ్ లాంగ్వేజ్ & లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ (ప్రైమరీ లెవల్-మదర్ టంగ్ తెలుగు/ఉర్దూ)
➥ 27.02.2023: పేపర్-5: అండర్ స్టాండింగ్ మ్యాథమెటిక్స్ & ఎర్లీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్(ప్రైమరీ లెవల్)
➥ 28.02.2023: పేపర్-6: పెడగోగి అక్రాస్ కరికులం & ఐసీటీ ఇంటిగ్రేషన్
Also Read:
తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
ఏపీ పాలిసెట్ 2023 పరీక్ష తేదీ ఖరారు! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ను మే 10న నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. మే 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది పాలిసెట్‌కు హాజరవుతారని సాంకేతిక విద్యాశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 54 పాలిటెక్నిక్ కేంద్రాల్లో 10 వేల మంది పరీక్ష రాయనున్నారు. మిగతా వారికి ఇతర విద్యా సంస్థల్లో కేంద్రాలు కేటాయిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..