ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జోసా చివరి విడత సీట్లను కేటాయించిన నేపథ్యంలో మిగిలిన సీట్లకు అక్టోబరు 26 నుంచి సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీశాబ్) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలు మినహా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా), ఐఐఈఎస్టీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర విద్యాసంస్థల్లో జోసా తర్వాత మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు. ఖాళీల వివరాలను అక్టోబరు 25న వెల్లడించనున్నారు.
షెడ్యూలు ఇదే..
✪ జోసా తర్వాత మిగిలిన సీట్ల వివరాల వెల్లడి: 25.10.2022
✪ రిజిస్ట్రేషన్, స్పెషల్ రౌండ్ ఎన్‌రోల్‌మెంట్ ఫీజు, ఛాయిస్ ఫిల్లింగ్, ఫిజికల్ వెరిఫికేషన్ (PwD) ప్రారంభం: 26.10.2022. (9:00 hrs)
✪ రిజిస్ట్రేషన్, స్పెషల్ రౌండ్ ఎన్‌రోల్‌మెంట్ ఫీజు ముగింపు తేది: 28.10.2022. (17:00 hrs)
✪ ఛాయిస్ ఫిల్లింగ్, ఫిజికల్ వెరిఫికేషన్ (PwD) ముగింపు తేది: 29.10.2022. (17:00 hrs)
✪ CSAB స్పెషల్ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: 30.10.2022. (17:00 hrs)
పూర్తి షెడ్యూలు ఇలా.. ☟
'నీట్' పీజీ కటాఫ్ మార్కులు తగ్గించిన కేంద్రం
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్-2022 పీజీ మెడికల్ అర్హత కటాఫ్ స్కోర్‌ను 25.714 పర్సంటైల్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్ అభ్యర్థులు 24.286 పర్సంటైల్ 174 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చెందిన వారికి 14.286 పర్సంటైల్ 138 మార్కులు, దివ్యాంగులకు 19.286 పర్సంటైల్ 157 మార్కులు సాధించిన విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లొ సీట్లు మిగిలిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కటాఫ్ మార్కులను తగ్గించింది. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
:: ఇవీ చదవండి ::
నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..