జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబరు 15న ప్రారంభించనున్నారు. నవంబరు 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి వర్చవల్‌గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీ లలో విద్యా బోధన తరగతులను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
దీంతో వైద్య విద్యలో విప్లవాత్మకమైన అడుగును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వేయనుంది. ఈ ఒక్క విద్యా సంవత్సరం (2022-23)లోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 4080 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్ తొలి విద్యా సంవత్సరం మొదలుకానుంది. ఈ ఏడాది నీట్ -2022కు అర్హత సాధించిన విద్యార్థులకు ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన ప్రారంభం కానుంది.
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం జిల్లాల్లో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. అలాగే త్వరలో కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.
ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసి మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేశారు. ఈ ఎనిమిది మెడికల్ కాలేజీల ప్రారంభంతో ఈ విద్యా సంవత్సరంలో 1150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. 2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఆ సంఖ్య 2091కి చేరింది.
వీటితోపాటు ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోనూ 85శాతం బీ కేటగిరీ మెడికల్ సీట్లను విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోనూ 1068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.
Also Read:
KNRUHS: యూజీ ఆయూష్ కోర్సుల్లో ప్రవేశాలు, నేటి నుంచి దరఖాస్తులు
యూజీ ఆయూష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయూష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్ జారీ చేసింది. 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..