CIPET Admission Test - 2024: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్)-2024 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కోర్సు అనుసరించి పదవతరగతి, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ పరీక్షను జూన్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి జూన్ 14న ప్రవేశపత్రాలు అందజేస్తారు. ఆగస్టు మొదటివారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
వివరాలు..
🔰 సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2024
కోర్సులు: డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా.
కోర్సుల వివరాలు..
➥ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ)
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.
➥ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ)
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.
➥ పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ కాడ్/కామ్(పీడీ-పీఎండీ విత్ క్యాడ్/క్యామ్)
అర్హత: 3 సంవత్సరాల డిప్లొమా(మెకానికల్/ప్లాస్టిక్స్/పాలిమర్/టూల్/ప్రొడక్షన్/మెకాట్రోనిక్స్/ఆటోమొబైల్/టూల్&డై మేకింగ్/పెట్రోకెమికల్స్/ఇండస్ట్రియల్/ఇన్‌స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా డీపీఎంటీ/డీపీటీ(సీపెట్)) లేదా తత్సమాన ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: 1.5 సంవత్సరాలు.
➥ పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్(పీజీడీ-పీపీటీ)
అర్హత: 3 సంవత్సరాల డిగ్రీ(సైన్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. డీపీటీ-డీపీఎంటీ, పీజీడీ-పీపీటీ, పీడీ-పీఎండీ విభాగాలకు వేర్వేరుగా పరీక్షలు ఉంటాయి. మార్కుల కేటాయింపు కూడా వేర్వేరుగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
✯ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2024.
✯ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.05.2024.
✯ సీపెట్ పరీక్ష తేది: 09.06.2024.
✯ ఎంపికైనవారికి ప్రవేశ పత్రాలు: 14.06.2024.
✯ కోర్సు ప్రారంభం: ఆగస్టు మొదటివారంలో.
ALSO READ;
CMAT - 2024 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2024 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, ట్రాన్స్ జెండర్లు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 80 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 5 విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..