నీట్ యూజీ సిలబస్‌లో ఇటీవల మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్‌ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్‌ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌ సిలబస్‌ (ఫిజిక్స్‌/కెమిస్ట్రీ)లోనూ మార్పు జరుగుతుందా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 


నీట్, జేఈఈ మెయిన్స్‌కు ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌ ఒకేలా ఉండటంతో విద్యార్థులకు వెసులుబాటు ఉండేది. నీట్‌లో తాజా మార్పులకు తగ్గట్లు జేఈఈ మెయిన్స్‌లోనూ మార్పులు జరగకుంటే విద్యార్థులపై భారం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫార్మసీ, వెటర్నరీ, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష సిలబస్‌ ఇంటర్‌ విద్యా మండలి సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది. నీట్‌కు సన్నద్ధమయ్యే వారు కూడా ఈ పరీక్ష రాస్తారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ సిలబస్‌లోనూ మార్పులు జరగాల్సి ఉంది. 


ఇప్పటివరకు సీబీఎస్‌ఈ (ఎన్సీఈఆర్టీ)కి అనుగుణంగానే సిలబస్‌లో ఇంటర్‌ విద్యామండలి మార్పులు, చేర్పులు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ, నీట్‌ సిలబస్‌ల్లో మార్పులు జరిగినందున ఇంటర్‌ విద్యా మండలి కూడా తదనుగుణంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.


దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) సిలబస్‌‌లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించిన సిలబస్‌ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్‌ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ విద్యాసంవత్సరంలో నీట్‌(యూజీ) పరీక్షను 2024, మే 5న నిర్వహించనున్నారు. కాగా నీట్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.


అయితే బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్‌ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్‌పై పెద్ద ప్రభావమేమీ చూపదని నిపుణులు అంటున్నారు. ఇది విద్యార్థులకు అనుకూలించే అంశమని చెప్పవచ్చు. అయితే సిలబస్‌ను ఆలస్యంగా విడుదల చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సిలబస్‌ తగ్గింపుతో ప్రస్తుత సెకండియర్‌ విద్యార్థుల కన్నా, ఫస్టియర్‌ విద్యార్థులకే అధిక ప్రయోజనం అని నిపుణలు అంటున్నారు.


తొలగించిన పాఠ్యాంశాల వివరాలు ఇలా..


➥ కెమిస్ట్రీ ఇంటర్ ఫస్టియర్‌: పదార్థం స్థితి, హైడ్రోజన్‌, ఎస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ.


➥ కెమిస్ట్రీ సెకండియర్‌: ఘనస్థితి, ఉపరితల రసాయశాస్త్రం, మెటలర్జీ, రోజువారీ జీవితంలో పాలిమర్లు, కెమిస్ట్రీ.


➥ ఫిజిక్స్ ఫస్టియర్‌: ప్యూర్‌ రోలింగ్‌, కనెక్టింగ్‌ బాడీలు, పాలిట్రోపిక్‌ ప్రక్రియ, బలవంతమైన, దెబ్బతిన్న డోలనాలు.


➥ ఫిజిక్స్ సెకండియర్‌: పొటెన్షియల్‌, నాన్‌ పొటెన్షియల్‌ సంభావ్యత, ప్రొటెన్షియో మీటర్‌, ఎర్త్‌ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిప్లయర్లు.


➥ జువాలజీలో యూనిట్‌-2: వానపాములు, యూనిట్‌-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, జ్ఞానేంద్రియాలు (చెవులు, కండ్లు), యూనిట్‌ -10లో జీవావరణం, పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్ధకం.


➥ బోటనీ ఫస్టియర్‌: ప్లాంట్‌ ఫిజియోలజీలో ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ ప్లాంట్స్‌, మినరల్‌ న్యూట్రిషన్‌, మార్పొలజీ.


➥ బోటనీ సెకండియర్‌: స్ట్రాటజీస్‌ ఫర్‌ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌.


➥ బోటనీలో కొత్తగా చేర్చినవి: బయో మాలిక్యూల్స్‌, ఎంజైములు, ప్రాపర్టీలు, మాల్వేస్‌, లెగుమనీస్‌ సహా మరికొన్ని అంశాలను చేర్చారు.


నీట్ యూజీ 2024 కొత్త సిలబస్ కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...