CBSE Parenting Calendar 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్త 2026-27 విద్యా సంవత్సరానికి గాను పేరెంటింగ్ క్యాలెండర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం లక్ష్యం కేవలం పిల్లల విద్యకే పరిమితం కాకుండా, వారి మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాన్ని బలోపేతం చేయడం. పిల్లల కోసం పాఠశాలలు, కుటుంబాలు కలిసి పనిచేసినప్పుడు, వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అభ్యసన అనుభవం మెరుగుపడుతుందని బోర్డు విశ్వసిస్తోంది.

Continues below advertisement

సీబీఎస్ఈ ప్రకారం, పేరెంటింగ్ క్యాలెండర్‌ను 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. ఆ సమయంలో, ఈ కార్యక్రమానికి పాఠశాలలు, ఉపాధ్యాయులు , తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు లభించింది. ఈ స్పందన దృష్టిలో ఉంచుకుని, ఈ క్యాలెండర్‌ను మరింత ఉపయోగకరంగా మార్చేందుకు ఈ సంవత్సరం అనేక మార్పులు చేశారు.

పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌లో తల్లిదండ్రులను భాగస్వామ్యాన్ని మరింత యాక్టివ్‌గా మార్చేందుకుఅనేక కార్యకలాపాలు ఉన్నాయి. ఈ కార్యకలాపాలు పిల్లల విద్యాభ్యాసంతోపాటు, వారి ప్రవర్తన, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేవలం పరీక్షలు లేదా ఫలితాల సమయంలోనే కాకుండా, సంవత్సరం పొడవునా తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసన ప్రక్రియలో భాగం కావాలని బోర్డు కోరుకుంటోంది.

Continues below advertisement

కొత్త అవసరాలకు అనుగుణంగా అప్‌డేషన్

ఈ సంవత్సరం క్యాలెండర్‌లో, మారుతున్న విద్యా వాతావరణానికి సిద్ధమవ్వడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, విభిన్న సామర్థ్యాలు గల పిల్లల అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మెరుగైన మద్దతును అందించడంపై ప్రాధాన్యత ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను కూడా సిఫార్సు చేయడం జరిగింది.

పాఠశాలలకు ప్రత్యేక విజ్ఞప్తి  

విద్యా సంవత్సరం పొడవునా పేరెంటింగ్ క్యాలెండర్‌ను క్రమం తప్పకుండా అమలు చేయాలని, అందులో సూచించిన కార్యక్రమాలను నిర్వహించాలని సీబీఎస్ఈ  అనుబంధ పాఠశాలలన్నింటికీ సూచించింది. దీనివల్ల పాఠశాలలకు, తల్లిదండ్రులకు మధ్య సంబంధాలు బలపడతాయని, పిల్లలకు వారి చదువుల కోసం సానుకూల, సహాయక వాతావరణం లభిస్తుందని బోర్డు పేర్కొంది. నేటి పిల్లలు చదువుతోపాటు మరెన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని కూడా బోర్డు అభిప్రాయపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, కుటుంబాలు, పాఠశాలలు కలిసి పనిచేస్తే, పిల్లలు ప్రతి స్థాయిలో మెరుగైన మద్దతును పొందగలరు.