CBSE SGCS: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2023 నోటిఫికేషన్

సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థినులు లబ్ది పొందుతారు.

Continues below advertisement

Single Girl Child Scholarship 2023: సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థినులు లబ్ది పొందుతారు. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ప్రతి సంవత్సరం అందిస్తోంది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

వివరాలు..

* సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2023

అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో పదకొండవ తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు.

స్కాలర్‌షిప్‌: ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు.

ముఖ్య తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.10.2023.

సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీలు: 25.09.2023 నుంచి 25.10.2023 వరకు.

Notification

Online Application

Website

ALSO READ:

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి
విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola