సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెప్టెంబరు 7న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్‌కార్డు ఐడీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. రెండు మూడు రోజుల్లో 10వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.


ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 


సీబీఎస్‌ఈ 12వ తరగతి ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఏదో ఒక సబ్జెక్టులో ఇంకా ఎక్కువ మార్కుల కోసం ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను కూడా ప్రకటించారు. ఫలితాల ప్రకటన సమయంలోనే పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన కంపార్ట్‌మెంట్ కేటగిరీ అభ్యర్థులందరికీ సీబీఎస్‌ఈ కంబైన్డ్ మార్క్ షీట్-కమ్-పాసింగ్ సర్టిఫికేట్‌ను అందజేస్తోందని బోర్డు తెలిపింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ, మైగ్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు వారి కంబైన్డ్ మార్క్ షీట్ కమ్ పాసింగ్ సర్టిఫికేట్ డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచబడుతుంది. రెండు డిజిటల్ పత్రాలు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం కోసం ఉపయోగించబడతాయి.



Also Read: సెప్టెంబరు 11న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు, రిజల్ట్స్ సమయమిదే!

ఇంప్రూవ్‌మెంట్ కోసం హాజరైన లేదా కంపార్ట్‌మెంటల్ విద్యకు అర్హత సాధించిన విద్యార్థుల విషయంలో, వారి డిజిటల్ లాకర్‌లో ఒకే సబ్జెక్ట్ పనితీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెప్టెంబరు 9 నుంచి నుండి కంపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం మార్కుల రీవాల్యుయేషన్‌ను కూడా బోర్డు ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల ఫోటోకాపీలు, రీవాల్యుయేషన్‌ను అందించే సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుందని సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది.



ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 23 నుంచి 29 వరకు, 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ప్రశ్నపత్రం చదవడానికి అదనంగా 15 నిమిషాల సమయం కేటాయించారు.సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ 2022 పరీక్షలను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. 



Also Read:
విద్యార్థుల్లో ఆందోళనకు పరీక్షలు, ఫలితాలే కారణం! ఎన్‌సీఈఆర్టీ సర్వేలో వెల్లడి!



సీబీఎస్‌ఈ 10, 12వ తరగతులు వార్షిక పరీక్షల ఫలితాలను జులై 22న వెల్లడించిన సంగతి తెలిసిందే. 10వ తరగతిలో 92.71% ఉత్తీర్ణులు కాగా, 12వ తరగతిలో 94.40% ఉత్తీర్ణత సాధించారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన తాజాసమాచారం తెలుసుకోవచ్చు.  


 


Also Read:


APRCET-2022: ఏపీఆర్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాలు ఇలా!
ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2022 (ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 01న ప్రారంభమైంది. 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ఏపీఆర్‌సెట్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 62 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..