CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

CBSE Class 10th Result 2024: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://cbse.gov.in ఫలితాలను తెలుసుకోవచ్చు.

Continues below advertisement

CBSE Class 10th Result 2024: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్షల ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://cbse.gov.in, cbseresults.nic.in ఫలితాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్‌ వివరాలను విద్యార్థులు తమకు అందుబాటులో ఉంచుకోవాలి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టిన తేదీ, స్కూల్ నెంబరు, అడ్మిట్ కార్డు ఐడీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. డిజీలాకర్‌, ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌లలో కూడా ఫలితాలను అందుబాటులో ఉంచారు.

Continues below advertisement

10వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం 10వ తరగతిలో మొత్తం 93.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 2.12లక్షల మందికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 47,983 మంది 95శాతానికి పైగా స్కోరు సాధించారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.75 శాతం, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30 శాతం, బెంగళూరులో 99.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

గతేడాది కంటే 0.48 శాతం పెరుగుదల  నమోదైంది.   బాలుర కంటే బాలికలు 2.04 శాతం పాయింట్లతో పైచేయి సాధించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలోల్ల మొత్తం 87.98 శాతం ఉత్తీర్ణ సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 91.52. కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 85.12 శాతంగా ఉంది. బాలుర కంటే 6.40 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 0.65 శాతం పెరుగదల నమోదైంది.

వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు పరీక్షలు..
నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏడాదికి రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించనుంది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది (2025-26 విద్యాసంవత్సరం) ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ నుంచి అమలు చేయనున్నారు. దీనికనుగుణంగా సెమిస్టర్‌ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కసరత్తులు ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ సీబీఎస్‌ఈని ఈ మేరకు కోరింది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చేనెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించే విధంగా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ నిమగ్నమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

ఒత్తిడి లేని విద్య కోసమే..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement