సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత పాఠశాలల నుంచి పొందవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేటు విద్యార్థుల అడ్మిట్ కార్డులను కూడా సీబీఎస్‌ఈ విడుదల చేసింది.
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
* హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- cbse.gov.in.
* అక్కడ హోంపేజీలో కనిపించే 'Main website' టాబ్ మీద క్లిక్ చేయాలి.
* క్లిక్ చేయగానే వచ్చే పేజీలో సీబీఎస్‌ఈ క్లాస్-10, 12 పరీక్షల హాల్‌టికెట్లకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
* విద్యార్థులు తమ వివరాలు నమోదుచేయగానే పరీక్ష హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
* హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని పరీక్షల సమయంలో వెంటతీసుకెళ్లాలి.
Download Admit Card for Private Candidates Board Examination 2023 (Main)
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీబీఎస్‌ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నాయి. పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై మార్చి 21 వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5 వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల షెడ్యూలును రూపొందించింది. కాగా.. 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షలను మార్చి 27నే నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ తాజాగా విడుదల చేసింది. కేవలం ఒకరోజు జరిగే పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. 12వ తరగతి మిగతా పరీక్షలు, పదోతరగతి పరీక్షల షెడ్యూల్ డిసెంబరు 29న ప్రకటించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
Also Read:
KNRUHS: ఆయూష్ పీజీ వైద్యసీట్ల భర్తీకి వన్‌టైం వెబ్‌ఆప్షన్లు, షెడ్యూలు ఇదే!
రాష్ట్రంలోని ఆయూష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యూనానీ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్ల కేటాయింపులు జరపనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..