CBSE Career Dashboard: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలల్లో విద్యార్థుల కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు 2025-26 సెషన్ కోసం కెరీర్ గైడెన్స్ డాష్‌బోర్డ్, కౌన్సిలింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్‌ను ప్రారంభించింది. ఈ రెండు కార్యక్రమాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల లీడర్ల కోసం రూపొందించింది. ఇది పిల్లలు తమ భవిష్యత్తు కోసం సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి, మానసికంగా దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమాలను మరింత మెరుగుపరచడానికి, CBSE విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరుల అభిప్రాయాలను కూడా తీసుకుంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

Continues below advertisement


కెరీర్ గైడెన్స్ డాష్‌బోర్డ్ అంటే ఏమిటి?


CBSE కొత్త కెరీర్ గైడెన్స్ డాష్‌బోర్డ్ అనేది విద్యార్థులు, ఉపాధ్యాయులు,పాఠశాల లీడర్ల కోసం రూపొందించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. ఈ డాష్‌బోర్డ్ పిల్లలు ఏ కెరీర్‌ను ఎంచుకోవాలనుకుంటున్నారో, దాని కోసం ఏమి చేయాలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దాని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.


కెరీర్ సమాచారం: ఇందులో జాతీయ -అంతర్జాతీయ స్థాయిలో కెరీర్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉదాహరణకు, ఏ కెరీర్ మీకు సరైనది కావచ్చు.


పర్శనల్ టూల్స్:డాష్‌బోర్డ్ విద్యార్థుల ఆసక్తి, నైపుణ్యాల ఆధారంగా సరైన కెరీర్‌ను ఎంచుకోవడానికి వారికి సహాయం చేస్తుంది.


గైడెన్స్ వనరులు: ఇందులో కెరీర్ ప్లానింగ్ కోసం సులభమైన సాధనాలు, సమాచారం అందుబాటులో ఉంటాయి, వీటిని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరూ ఉపయోగించవచ్చు.


ప్రారంభ సమయంలో, నిపుణులు ఈ డాష్‌బోర్డ్ లక్షణాలను చూపించారు. దాని ఇంటర్‌ఫేస్ చాలా సులభంగా ఉంది. ఎవరైనా సులభంగా ఉపయోగించవచ్చని వారు చెప్పారు. ఈ డాష్‌బోర్డ్ విద్యార్థులకు వారి కలల కెరీర్‌ను ఎంచుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది.


కౌన్సిలింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఏమిటి?


CBSE ప్రారంభించిన రెండో ప్రోగ్రామ్ కౌన్సిలింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్. ఇది పాఠశాలల్లో విద్యార్థుల మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది. ఈ మోడల్ లక్ష్యం ఏమిటంటే, పిల్లలు చదువు కెరీర్‌లో మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ మోడల్కు ఉన్న కొన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం.


పాఠశాలల్లో సహాయ వ్యవస్థ: ప్రతి పాఠశాలలో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని సపోర్ట్ చేసే నిర్మాణాత్మక వ్యవస్థ ఉంటుంది.


బాధ్యతలు-పర్యవేక్షణ: ఈ వ్యవస్థను ఎలా అమలు చేయాలో, దాని ప్రభావాన్ని ఎలా చెక్చేయాలో పాఠశాలలకు తెలియజేస్తారు.


కౌన్సిలింగ్ సౌకర్యం: పిల్లలు వారి సమస్యల కోసం ప్రొఫెషనల్ కౌన్సిలర్ల సహాయం పొందుతారు.


దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?


CBSE రూపొందించిన ఈ రెండు కార్యక్రమాలు విద్యార్థులకు గేమ్-ఛేంజర్‌గా చెబుతున్నారు. కెరీర్ గైడెన్స్ డాష్‌బోర్డ్ పిల్లలు సరైన కెరీర్‌ను ఎంచుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా వారు తమ ఆసక్తి, నైపుణ్యాల ఆధారంగా భవిష్యత్తును ప్లాన్ చేసుకోవచ్చు. అదే సమయంలో, కౌన్సిలింగ్ హబ్ పిల్లలకు ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలను ఎదుర్కోవడంలో సహాయం చేస్తుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాల నుంచి చాలా సహాయం పొందుతారు, ఎందుకంటే వారు పిల్లలకు బాగా మార్గనిర్దేశం చేయగలరు. సమాచారం ప్రకారం, ఈ రెండు కార్యక్రమాలు 2025-26 సెషన్ నుంచ ప్రారంభమవుతాయి. CBSE దీన్ని అమలు చేయడానికి పాఠశాలలకు మార్గదర్శకాలు ఇచ్చింది.