క్యాట్-2022 ఫలితాలు డిసెంబరు 21న విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బెంగళూరు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి తమ స్కోరుకార్డు చూసుకోవచ్చు. ఈ ఫలితాల్లో 11 మంది అభ్యర్థులకు నూటికి నూరుశాతం మార్కులు వచ్చాయి. వీరిలో ఇద్దరు తెలంగాణకు చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి కూడా ఇద్దరేసి అభ్యర్థులు 100 శాతం మార్కులు సాధించారు. ఇక గుజరాత్, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు.


క్యాట్ ఫలితాలు ఇలా చూసుకోండి..


➤ మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - iimcat.ac.in


➤ అక్కడ హోంపేజీలో క్యాట్ ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.


➤ అక్కడ కనిపించే లాగిన్ సెక్షన్ అభ్యర్థులు తమ తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి 'LOGIN' బటన్‌పై క్లిక్ చేయాలి.  . 


➤ కంప్యూటర్ స్క్రీన్ మీద క్యాట్ ర్యాంక్ కార్డు కనిపిస్తుంది


➤ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Website


22 మంది అభ్యర్థులకు 99.99 పర్సంటైల్
క్యాట్ ఫలితాల్లో 22 మంది అభ్యర్థులు 99.99 పర్సంటైల్ సాధించారు. వీరిలో 21 మంది పురుషులు కాగా, కేవలం ఒక్క మహిళ మాత్రమే ఉన్నారు. 22 మందిలో ఢిల్లీ-2, గుజరాత్-3, కర్ణాటక-2, మధ్యప్రదేశ్-3, మహారాష్ట్ర-3, పంజాబ్-1, రాజస్థాన్-1, తమిళనాడు-1, తెలంగాణ-1, ఉత్తర్ ప్రదేశ్-2, వెస్ట్ బెంగాల్ నుంచి ముగ్గులు అభ్యర్థులు ఉన్నారు. 22 మంది అభ్యర్థులు 99.98 పర్సంటైల్ సాధించారు. వీరిలో 19 మంది పురుషులు ఉండగా, ముగ్గురు మహిళలు ఉన్నారు.


క్యాట్ 2022 పరీక్షను దేశవ్యాప్తంగా నవంబరు 27న నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షకు మొత్తం 2.55 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2.22 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరుశాతరం 87%గా నమోదైంది. పరీక్షకు హాజరైనవారిలో 35 శాత మహిళలు, 65 శాతం పురుషులు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 


Also Read:


TS EAMCET 2023: జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్! ఈ సారికి 'ఇంటర్' వెయిటేజీ లేనట్లే?
తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ జనవరిలో విడుదలకానుంది. ఒకపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను వెల్లడించడం, మరోవైపు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఎంసెట్‌ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. ఎంసెట్‌ పరీక్షను మే రెండోవారం లేదా మూడోవారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌ పరీక్షల తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
తెలంగాణ ఎంసెట్ 2023 పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..