BITS Pilani MBA Admissions Notification 2024: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ సైన్స్ (BITS) పిలానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో (MBA Admissions) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష (బిజినెస్ అనలిటిక్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్-BAAT), పర్సనల్ ఇంటర్వ్యూ (లేదా) క్యాట్‌ (CAT) 2023/ ఎక్స్‌ఏటీ (XAT) 2024/ జీమ్యాట్‌ (GMAT) 2023, అకడమిక్ మెరిట్, పని అనుభవం తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 19న అర్దరాత్రి 11.59 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సవరణకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు అవకాశం కల్పిస్తారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను మార్చి 18న విడుదలచేయనున్నారు. అభ్యర్థులకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష (BAAT) నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 నుంచి రెండో విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభంకానుంది. 


వివరాలు..


➥ ఎంబీఏ (బిజినెస్ అనలిటిక్స్) 


కోర్సు వ్యవధి: రెండేళ్లు (ఫుల్‌టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్).


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థులు ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (బిజినెస్ అనలిటిక్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - BAAT), పర్సనల్ ఇంటర్వ్యూ (లేదా) క్యాట్‌ (CAT) 2023/ ఎక్స్‌ఏటీ (XAT) 2024/ జీమ్యాట్‌ (GMAT) 2023, అకడమిక్ మెరిట్, పని అనుభవం తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


పరీక్ష కేంద్రాలు: లక్నో, ఢిల్లీ, పిలానీ, అహ్మదాబాద్, ముంబయి, నాగ్‌పూర్, హైదరాబాద్, పుణే, పాట్నా, గోవా, కోల్‌కతా, బెంగళూరు, తిరువనంతపురం, కోయంబత్తూరు, భోపాల్, చెన్నై.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.02.2024. (11:59 PM)


➥ దరఖాస్తుల సవరణ: 28.02.2024 - 04.03.2024.


➥ ప్రవేశ పరీక్ష (BAAT) అడ్మిట్‌కార్డుల విడుదల: 18.03.2024.


➥ ప్రవేశ పరీక్ష (BAAT) తేది: 07.04.2024.


➥ రౌండ్-2 ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం: 13.04.2024.


Notification


Online Application


Website


ALSO READ:


శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏవియేషన్‌ కోర్సు - అర్హతలు, ఎంపిక, శిక్షణ వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో 'ఏవియేషన్‌ స్కూల్‌' ఏర్పాటైంది. దీనిద్వారా విమానాల నిర్వహణ ఇంజినీరింగ్‌(AME -Aircraft Maintenance Engineering) కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో విమానయాన సంస్థల్లో పెరుగుతున్న మానవ వనరులకు అవసరాలకు అనుగుణంగా జీఎంఆర్‌ సంస్థ ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సుకు డీజీసీఏతోపాటు ఐరోపా విమానయాన భద్రతా ఏజెన్సీ (యాసా) అనుమతులు కూడా ఉన్నాయి. నాలుగేళ్ల ఇంటిగ్రేటెట్ ఇంజినీరింగ్‌ కోర్సును ఈ జూన్‌ నుంచే ప్రారంభించనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. తెలంగాణ ఎంసెట్, జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్ష ద్వారా మొత్తం 200 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లోని విమానయాన సంస్థల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాసియాలోనే ఇది తొలి 'ఏవియేషన్‌ స్కూల్‌'గా నిలవనుంది. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...