AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు (ఏప్రిల్ 12) విడుదలకానున్నాయి.  తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో, బోర్డు కార్యదర్శి ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే  రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు వెల్లడించనుండటం విశేషం.


ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,35,056 మంది అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం జనవరి 4న పూర్తి చేశారు. దీంతో ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను విడుదల చేస్తారా.. లేక గ్రేడ్ ల వారిగా ఫలితాలను విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 


ఇంటర్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షా ఫలితాలను పొందాలనుకునే విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా అధికారిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు.


ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..


Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి


Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి


Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి


Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి


Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి


Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.


ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..


ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి


ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి


https://resultsbie.ap.gov.in/


https://www.manabadi.co.in/


ALSO READ:


TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈసారి ముందుగానే వెల్లడి, ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షల ప్రక్రియ ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభంకాగా.. పేప‌ర్ వాల్యూయేషన్ వేగంగా సాగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 25లోపు ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..