హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రవేశపరీక్షలో అర్హత సాధించి, గత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేని, కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు అక్టోబరు 17న వర్సిటీలోని సీఎస్‌టీడీ బిల్డింగ్‌, మినీ ఆడిటోరియంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉదయం 11.30 గంటల్లోగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హాజరైనవారికి అనుమతించరు. స్పాట్ ప్రవేశాలకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది. అదేరోజు ట్యూషన్ ఫీజుగా రూ.40,000 డిడి తీసి సమర్పించాల్సి ఉంటుంది.


అభ్యర్థులు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు ఇవే..


➥ ఆన్‌లైన్ అప్లికేషన్


➥ హాల్‌టికెట్


➥ ర్యాంకు కార్డు


➥ పదోతరగతి మెమో


➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్-టీసీ (ఒరిజినల్)


➥ మైగ్రేషన్ సర్టిఫికేట్ (ఒరిజినల్)


➥ డీఎడ్ లేదా తత్సమాన సర్టిఫికేట్


➥ డిగ్రీ మార్కుల మెమో


➥ డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికేట్


➥ సర్వీసెస్ సర్టిఫికేట్ (ఎంఈవో లేదా ఆపై ఆఫీసర్ జారీచేసింది)


➥ కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్)


➥ మెడికల్ సర్టిఫికేట్ (దివ్యాంగులకు)


➥ పదోతరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు

సీట్ల వివరాలు..


1) ఆంధ్ర మహిళా సభ, హైదరాబాద్


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 10


సబ్జెక్టులవారీగా సీట్లు: మ్యాథ్స్-02, ఫిజిక్స్-03, బయోలాజికల్ సైన్స్-03, సోషల్ స్టడీస్-02.


2) గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ - హనుమకొండ, వరంగల్


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 14


సబ్జెక్టులవారీగా సీట్లు: మ్యాథ్స్-02, ఫిజిక్స్-03, బయోలాజికల్ సైన్స్-03, సోషల్ స్టడీస్-06.


3) ఐఏఎస్‌ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 05


సబ్జెక్టులవారీగా సీట్లు: ఫిజిక్స్-02, బయోలాజికల్ సైన్స్-02, సోషల్ స్టడీస్-01.


4) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఫర్ ఎడ్యుకేషన్ క్యాంప్ - కర్నూలు. 


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 06


సబ్జెక్టులవారీగా సీట్లు: మ్యాథ్స్-01, ఫిజిక్స్-02, బయోలాజికల్ సైన్స్-02, సోషల్ స్టడీస్-01. 


5) ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- గుంటూరు. 


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 05


సబ్జెక్టులవారీగా సీట్లు: ఫిజిక్స్-02, సోషల్ స్టడీస్-03.


6) గురజాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- శ్రీకాకుళం. 


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 09


సబ్జెక్టులవారీగా సీట్లు: మ్యాథ్స్-01, ఫిజిక్స్-02, బయోలాజికల్ సైన్స్-02, సోషల్ స్టడీస్-04.  


7) బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- ఖమ్మం. 


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 11


సబ్జెక్టులవారీగా సీట్లు: మ్యాథ్స్-01, ఫిజిక్స్-02, బయోలాజికల్ సైన్స్-02, సోషల్ స్టడీస్-06.


8) ఓయూ గ్రాడ్యుయేట్స్ ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ - పరిగి, వికారాబాద్. 


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 08


సబ్జెక్టులవారీగా సీట్లు: మ్యాథ్స్-01, ఫిజిక్స్-04, బయోలాజికల్ సైన్స్-03.


9) అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ - రాజంపేట. 


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 11


సబ్జెక్టులవారీగా సీట్లు: ఫిజిక్స్-01, బయోలాజికల్ సైన్స్-02, సోషల్ స్టడీస్-02.


10) వాణినికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- కరీంనగర్. 


అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 09


సబ్జెక్టులవారీగా సీట్లు: ఫిజిక్స్-05, బయోలాజికల్ సైన్స్-02, సోషల్ స్టడీస్-02.


ALSO READ:


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...