ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్(AP ICET)-2022 ఫలితాలు ఆగస్టు 8న సాయంత్రం విడుదలయ్యాయి. ఫలితాలతోపాటు ఐసెట్ ర్యాంకు కార్డులను కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి అధికారులు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ ఐసెట్-2022 పరీక్షకు మొత్తం 42,496 మంది హాజరుకాగా 37,326 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం పాస్ అయ్యారు. ఇక అమ్మాయిలు విషయానికొస్తే 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. తిరుపతికి చెందిన రెడ్డప్పగారి ఖాతేం 180 మార్కులతో మొదటి ర్యాంకును సాధించాడు. రెండో స్థానంలో గుంటూరుకు చెందిన దంటాలా పూజిత వర్ధన్ నిలిచాడు.
Download AP ICET 2022 Rank Cards
AP ICET 2022 ప్రవేశ పరీక్షను జులై 25న నిర్వహించారు. ఏపీలోని 24 జిల్లాలతో పాటు హైదరాబాద్‌తో కలిపి మొత్తం 107 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్ 2022ను నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జులై 27న విడుదల చేసి జులై 29న సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించారు.
AP ICET 2022 ప్రవేశ పరీక్షకు మొత్తం 49,157 మంది దరఖాస్తు చేయగా.. 42,496 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 86.45 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 24 నగరాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 70.92 శాతం హాజరు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 93.3 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 93.1, పశి్చమ గోదావరి జిల్లాలో 93 శాతం మంది హాజరయ్యారు.
AP ICET 2019 results: చెక్ చేసుకోండి ఇలా...
- ఫలితాల కోసం అభ్యర్థులు ముందుగా APSCHE అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx ఓపెన్ చేయండి.
- మీకు AP ICET 2022 Results, బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, ఐసెట్ హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- వివరాలు నమోదు చేయగానే ఏపీ ఐసెట్ 2022 ఫలితాలు కనిపిస్తాయి.
- ఫలితాలను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
AP ICET 2019 Rank Cards: చెక్ చేసుకోండి ఇలా...
- ఫలితాల కోసం అభ్యర్థులు ముందుగా APSCHE అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx ఓపెన్ చేయండి.
- అక్కడ హోంపేజీలో AP ICET 2022 Rank Cards బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, ఐసెట్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేది వివరాలను నమోదుచేయాలి.
- వివరాలు నమోదు చేయగానే ఏపీ ఐసెట్ 2022 ర్యాంకు కార్డులు కనిపిస్తాయి.
- ఫలితాలను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Scholarships: ‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు, చివరితేది ఇదే!
CUET - UG 2022: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షలు ఎప్పుడంటే?
బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!
పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..