రాష్ట్రంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆర్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఫిబ్రవరి 9 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 7న విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు వెబ్‌కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. ఫిబ్రవరి 15నే వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించనున్నారు. వీరికి ఫిబ్రవరి 17న సీట్లను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు 20 నుంచి 24లోపు కళాశాలల్లో చేరాలని నజీర్ సూచించారు.


షెడ్యూలు ఇలా..


➥వెబ్‌కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్: 09.02.2023 -  11.02.2023.


➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 10.02.2023 - 12.02.2023.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 13.02.2023 - 15.02.2023.


➥ వెబ్ ఆప్షన్ల మార్పు: 15.02.2023.


➥ సీట్ల కేటాయింపు: 17.02.2023 ( సా. 6.00 గం. తర్వాత) 


➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 20.02.2023 - 24.02.2023.


Counselling Website


ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET-2022)ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది. షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 17 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించింది. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తొలి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 62 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాలను నవంబరు 6న వెల్లడించారు.


పీజీ అర్హతకు 50% సీట్లు..
పీహెచ్‌డీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆర్‌సెట్)లో సీట్ల రిజర్వేషన్లలో మార్పులు చేయనున్నారు. పీజీ అర్హతతో ఆర్‌సెట్ రాసిన వారికి 50%, జాతీయ అర్హత పరీక్ష (నెట్), జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్), గేట్, స్లెట్, టీచర్స్ ఫెలోషిప్, ఎంఫిల్ అభ్యర్థులకు 50 శాతం సీట్లు కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి. సీఎం ఆమోదం అనంతరం ఈ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు పీజీ అర్హతతో ఆర్‌సెట్ రాసిన వారికి 75%, నెట్, స్లెట్ తదితర అర్హతులున్న వారికి 25% సీట్ల కేటాయింపు ఉంది. దీనిపై విమర్శలు రావడం, నెట్, స్లెట్, ఎంఫిల్ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో 50శాతం చొప్పున మార్పు చేస్తూ ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు పంపింది. వీటికి సీఎం ఆమోదంలో జాప్యం జరుగుతుండడంతో కౌన్సిల్ వాయిదాపడింది. దీంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు.


                                                 


Also Read:


KNRUHS: ఆయూష్‌ పీజీ వైద్యసీట్ల భర్తీకి వన్‌టైం వెబ్‌ఆప్షన్లు, షెడ్యూలు ఇదే!
రాష్ట్రంలోని ఆయూష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యూనానీ కోర్సులో కన్వీనర్‌ కోటా సీట్లను ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్ల కేటాయింపులు జరపనున్నారు. 
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..