TS Model School Admissions: తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభంకానుంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 7న మండల కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు.


వివరాలు...


* మోడల్‌ స్కూల్స్ ప్రవేశాలు - 2024


ప్రవేశాలు కల్పించే తరగతులు: 6, 7, 8, 9, 10.


వయోపరిమితి: 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.


పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.01.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.02.2024.


➥ పరీక్ష తేదీ: 07.04.2023.


పరీక్ష సమయం:


➥ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, 


➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.


పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.


Website


ALSO READ:


గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి డిసెంబరు 15న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువు డిసెంబరు 18న ప్రారంభంకాగా.. దరఖాస్తు గడువు జనవరి 6తో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును రెండువారాలపాటు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు జనవరి 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారకం విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...