AP PECET 2025 Notification: ఏపీలోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2025 నోటిఫికేష‌న్ మార్చి 27న విడుద‌లైంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 23 నుంచి ఫిజిక‌ల్ టెస్టులు, గేమ్ స్కిల్ టెస్టులు నిర్వహించ‌నున్నారు. టెస్టులు పూర్తయిన వారంరోజులకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాదికిగాను గుంటూరులోని ఆచార్యనాగార్జున యూనివర్సిటీ పీఈసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టింది. 


వివరాలు...


* ఏపీ పీఈసెట్ – 2025 (AP PECET 2025)


అర్హత: బీపీఈడీ కోర్సుకు డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూజీడీపీఈడీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 


వయోపరిమితి: బీపీఈడీ కోర్సుకు 19 సంవత్సరాలు, డీపీఈడీ కోర్సుకు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇదివరకే పీఈటీలుగా పనిచేస్తున్న అభ్యర్థులు ఏపీపీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వీరు సంబంధిత డీఈఓల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 27.03.2025.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2025.


➥ ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష తేది (ఫిజికల్ ఈవెంట్స్): 23.06.2025 నుంచి.