APPECET: ఏపీ పీఈసెట్ – 2025 దరఖాస్తు ప్రారంభం, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పుడంటే?

ఏపీలోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

AP PECET 2025 Application: ఏపీలోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2024 నోటిఫికేష‌న్ మార్చి 25న విడుద‌లైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా జూన్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.1000  ఆల‌స్య రుసుముతో జూన్ 11 వ‌ర‌కు, రూ.2000 ఆల‌స్య రుసుముతో జూన్ 13 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల సవరణకు జూన్ 12 నుంచి 14 వరకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 17 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 23 నుంచి ఫిజిక‌ల్ టెస్టులు, గేమ్ స్కిల్ టెస్టులు నిర్వహించ‌నున్నారు. టెస్టులు పూర్తయిన వారంరోజులకు ఫలితాలను వెల్లడించనున్నారు. గుంటూరులోని ఆచార్యనాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈవెంట్లు నిర్వహించనున్నారు.

Continues below advertisement

వివరాలు...

* ఏపీ పీఈసెట్ – 2025 (AP PECET 2025)

అర్హత: బీపీఈడీ కోర్సుకు డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూజీడీపీఈడీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2025 నాటికి బీపీఈడీ కోర్సుకు 19 సంవత్సరాలు, డీపీఈడీ కోర్సుకు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇదివరకే పీఈటీలుగా పనిచేస్తున్న అభ్యర్థులు ఏపీపీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వీరు సంబంధిత డీఈఓల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్- రూ.900, బీసీ-రూ.800, ఎస్సీ-ఎస్టీలకు రూ.700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్: గరిష్టంగా 400మార్కులు.


స్కిల్ టెస్ట్: గరిష్టంగా 100 మార్కులు.


ప్రవేశ పరీక్ష సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్‌ల పరిశీలన..

➥  స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్‌లు.

డిపిఎడ్ / ఎన్ఐఎస్ / యోగా / స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ / స్పోర్ట్స్ సైన్స్ / స్పోర్ట్స్ జర్నలిజం / ఒలింపిక్ ఎడ్యుకేషన్ / అడ్వెంచర్ స్పోర్ట్‌లో బేసిక్ కోర్సు వీటిలో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణత సర్టిఫికెట్.

ఎన్‌సీసీ సర్టిఫికేట్ (సి-సర్టిఫికేట్ / బి-సర్టిఫికేట్).

పైన పేర్కొన్న అన్ని సర్టిఫికెట్ల యొక్క ధృవీకరించబడిన ఫోటోస్టాట్ కాపీల సెట్ మరియు హాల్ టికెట్ యొక్క ఫోటోస్టాట్ కాపీ.

దరఖాస్తు సమయంలో కావాల్సిన డాక్యుమెంట్‌లు..

క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్.

ఎస్‌ఎస్‌సీ లేదా పరీక్ష హాల్ టికెట్ నంబర్.

➥  పుట్టిన తేదీ దృవీకరణ సర్టిఫికేట్.

➥  ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థుల విషయంలో కాస్ట్ సర్టిఫికేట్.

➥  ఆధార్ నంబర్.

➥  పిహెచ్‌, ఎన్‌సిసి, క్రీడలు మొదలైనవి.

➥  తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికేట్(లక్ష వరకు లేదా రెండు లక్షల వరకు లేదా రెండు లక్షల రూపాయలకు పైగా)

➥  రేషన్ కార్డు.

➥  స్థానికత ప్రూఫ్ కోసం స్టడీ లేదా రెసిడెన్సీ లేదా సంబంధిత సర్టిఫికేట్.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 27.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.06.2025.

➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 11.06.2025.

➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 13.06.2025.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 12 - 14.06.2025 వరకు.

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 17.06.2025 నుంచి.

➥ ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష తేది (ఫిజికల్ ఈవెంట్స్): 23.06.2025 నుంచి.

రిపోర్టింగ్ సమయం: ఉదయం 6 గంటలు.

ఈవెంట్స్ ప్రారంభం: ఉదయం 7 గంటల నుంచి.

వేదిక: A.N.U. Campus, Guntur.

Notification

Online Application

Fee Payment

Instruction Booklet

Website

Continues below advertisement