APSWREIS Admission Notification: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2022-23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువు పూర్తిచేసి ఉండాలి.


విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 23లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఒకసారి దరఖాస్తు అప్‌లోడ్ చేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వివరాల్లో మార్పులకు అవకాశం ఉండదు. కాబట్టి వివరాలు జాగ్రత్తగా నమోదుచేయాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 186 గురుకులాల్లో మొత్తం 15,020 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు 11,266 సీట్లు; బీసీసీ (ఎస్సీ-కన్వర్టెడ్)-1,876 సీట్లు; ఎస్టీలకు 938 సీట్లు; బీసీలకు 752 సీట్లు; ఓసీలకు 188 సీట్లు కేటాయించారు.


వివరాలు..


* డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రవేశాలు (బీఆర్‌ఏజీ సెట్-2024)


సీట్ల సంఖ్య: 15,020.


సీట్ల కేటాయింపు: ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. ప్రత్యేక కేటగిరీ కింద 15%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు. ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను ఎస్సీలకు కేటాయిస్తారు. ఎస్సీలకు 11,266 సీట్లు; బీసీసీ (ఎస్సీ-కన్వర్టెడ్)-1,876 సీట్లు; ఎస్టీలకు 938 సీట్లు; బీసీలకు 752 సీట్లు; ఓసీలకు 188 సీట్లు


అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2022-23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థులు కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.


వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2011 నుంచి 31.08.2015 మధ్య; ఓసీ, బీసీ, బీసీ-సి విద్యార్థులు 01.09.2013 నుంచి 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.


ఆదాయపరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.01.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2024.


➥ ప్రవేశ పరీక్ష తేదీ: 10.03.2024.


5th-Annexure-A(SeatMatrix)


Notification


Online Application


Website


ALSO READ:


మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సీవోఈ (సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్) కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. 
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..