Tenth Pre Final Exams: పదోతరగతి 'ప్రీ ఫైనల్‌' పరీక్షల షెడ్యూలు విడుదల! ఇతర తరగతులకు 'ఎఫ్ఏ-4' పరీక్షలు ఎప్పుడంటే?

ఏపీలో పదోతరగతి విద్యా­ర్థులకు సంబంధించిన ప్రీ ఫైనల్‌ పరీక్షల తేదీలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 9 నుంచి 20 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Continues below advertisement

ఏపీలో పదోతరగతి విద్యా­ర్థులకు సంబంధించిన ప్రీ ఫైనల్‌ పరీక్షల తేదీలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 9 నుంచి 20 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ –2 కాంపోజిట్‌ పేపర్‌ మినహాయించి అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ –2 కాంపోజిట్‌ పేపర్‌ ఒక్కటే ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ మార్చి 1న షెడ్యూళ్లను ప్రకటించారు.

Continues below advertisement

పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలతోపాటు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4 పరీక్షలను కూడా ఇవే తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి విద్యార్థులు సాధించిన మార్కులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్‌లో నిర్ణీత గడువులోగా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ మార్చి 9న - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్ కోర్సు)

➥ మార్చి 10న - సెకండ్ లాంగ్వేజ్

➥ మార్చి 14న - ఇంగ్లిష్

➥ మార్చి 15న - మ్యాథమెటిక్స్

➥ మార్చి 16న - సైన్స్

➥ మార్చి 17న - సోషల్ స్టడీస్

➥ మార్చి 18న - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు), OSSC మెయిన్ లాంగ్వే్జ్ పేపర్-1

➥ మార్చి 23న - OSSC మెయిన్ లాంగ్వే్జ్ పేపర్-2

పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..

వార్షిక పరీక్షల షెడ్యూలు ఇలా..

ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. మరోవైపు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. 

మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి..

పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లిష్
ఏప్రిల్ 10 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 13 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17 కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18 ఒకేషనల్ కోర్సు

Also Read:

తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్! ఇక 'ఛాయిస్' మీదే!

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement