ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం (జూన్ 23న) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ హాల్‌‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పాఠశాల లాగ్‌ఇన్‌లో సంబంధిత విద్యా సంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు ఉంటాయని, మార్కుల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 2 నుంచి 10 వరకు జరిగిన పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


ఫలితాల కోసం వెబ్‌సైట్: https://www.bse.ap.gov.in/


ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 6న ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,64,152 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం నిర్వహించారు. అనంతరం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.


గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్‌ పెరిగింది. అది 3.47 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్‌ పర్సంటేజ్‌ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్‌ 60.39శాతం. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్‌ అయ్యారు.


ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 938 స్కూల్స్‌ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్‌ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్‌ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్‌ ఉంటే...  2,95,807 మంది బాలికలు ఉన్నారు. 


ALSO READ:


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు - వివరాలు ఇలా!
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..