AP SSC Supplementary Exams: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) పరీక్షలను మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.


పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ పేరు, జిల్లా, పాఠశాల, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఏవైనా తప్పులుంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించపు గడువు ముగియగా.. రూ.50 ఆలస్య రుసుముతో మే 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.


టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పాఠశాలలవారీగా పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


 టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..


➥  మే 24: ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్-1


➥  మే 25: సెకండ్‌ ల్యాంగ్వేజ్‌


➥  మే 27: ఇంగ్లిష్‌


➥  మే 28: మ్యాథమెటిక్స్‌


➥  మే 29: ఫిజికల్ సైన్స్


➥  మే 30: జీవ శాస్త్రం


➥  మే 31: సోషల్ స్టడీస్‌


➥ జూన్ 1న: కాంపోజిట్ విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష


➥ జూన్ 3న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్ష. 



తెలంగాణలో ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 62.47 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. 11.87 శాతం సెకండ్ క్లాస్ లో పాసయ్యారు. 5.66 శాతం మూడో క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. ఇక హిందీ మీడియంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12 మంది ఎగ్జామ్ రాయగా, అందరూ పాసయ్యారు. పదోతరగతి ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది.


పదోతరగతి ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 98.43 %, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 98.43 %, ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 98.40 %, ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక సోషల్ వెల్ఫేర్ 94.55 %, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 %, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లు 89.46 %, కస్తూర్బా విద్యాలయాల్లో 88.96 %, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38 శాతం, మున్సిపల్ హైస్కూల్స్‌లో 75.42 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..