AP Tenth Class Short Memos: ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షార్ట్‌ మెమోలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థు మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇచ్చిన షార్ట్‌ మెమోల్లోని తప్పులను సరి చేసి, వాటిని కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశామన్నారు. ఒకవేళ కొత్త షార్ట్‌ మెమోల్లో ఏమైనా తప్పులుంటే.. సంబంధిత ఆధారాలతో జులై 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.


పదోతరగతి షార్ట్ మెమోల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్‌ 26న విడుదలైన సంగతి తెలిసిందే. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,61,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 67,115 మంది (62.21 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 59.99 శాతం ఉత్తీర్ణులుకాగా.. బాలికలు 65.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 6 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ జూన్ 26న విడుదల చేశారు.  


జులై 1 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం..
పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల పట్ల సందేహాలుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జూన్ 27న ప్రారంభంకాగా..  జులై 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం రూ.500 చొప్పున విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజుగా చెల్లించాలి.


Online Application for RV/RC of SSC ASE May 2024  


అయితే అంతకు ముందు రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,16,615 మంది ఉన్నారు. గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 86.69 శాతం విద్యార్థుల ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 84.32 శాతం, బాలికలు 86.69 శాతం ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను జూన్ 26న విడుదల చేశారు.


ALSO READ:


జులై 1 నుంచి ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన
ఏపీలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పర్యవేక్షణలో నడిచే ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం జులై 1 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితాను కేటగిరీలవారీగా ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికైనవారు విద్యార్హతకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్లు, సంబంధిత కేటగిరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు వారికి నిర్ణయించిన తేదీల్లో అన్ని సర్టిఫికేట్లను తీసుకొని ఉదయం 9 గంటల వరకు సంబంధిత కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యాంపస్‌ల వారీగా ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను జులై 11న విడుదల చేయనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..