AP SSC Board Exams | అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారికంగా విడుదల చేసింది. ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ - 2026 ప్రకారం మార్చి 16, 2026న ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ ఏప్రిల్ 01, 2026 వరకు కొనసాగుతాయి. దాదాపు అన్ని ప్రధాన పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, మరియు వొకేషనల్ వంటి కొన్ని పరీక్షలకు సమయం భిన్నంగా ఉంటుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మార్చి 2026లో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. 

Continues below advertisement

SSC అకడమిక్ కోర్సుతో పాటు OSSC కోర్సు అభ్యర్థులకు కూడా ఇదే ఎగ్జామ్ షెడ్యూల్ వర్తిస్తుంది. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలను పరిగణనలోకి తీసుకుని ఈ టైమ్ టేబుల్ రూపొందించారు.   

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ - మార్చి 2026

తేదీ  సబ్జెక్టు సమయం మార్కులు
16.03.2026 (సోమవారం) ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-A) / ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I (కాంపోజిట్ కోర్సు) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100/70
18.03.2026 (బుధవారం) సెకండ్ లాంగ్వేజ్ ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
20.03.2026 (శుక్రవారం) ఇంగ్లీష్ (English) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
23.03.2026 (సోమవారం) గణితం (Mathematics) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
25.03.2026 (బుధవారం) భౌతిక శాస్త్రం (Physical Science) ఉ. 09:30 నుండి ఉ. 11:30 వరకు 50
28.03.2026 (శనివారం) జీవ శాస్త్రం (Biological Science) ఉ. 09:30 నుండి ఉ. 11:30 వరకు 50
30.03.2026 (సోమవారం) సాంఘిక శాస్త్రం (Social Studies) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
31.03.2026 (మంగళవారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్సు) / OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I ఉ. 09:30 నుండి ఉ. 11:15/12:45 వరకు 30/100
01.04.2026 (బుధవారం) OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II / SSC వొకేషనల్ కోర్సు (థియరీ) ఉ. 09:30 నుండి ఉ. 11:30/12:45 వరకు 100/40

ఉమ్మడి సిలబస్: SSC అకడమిక్ కోర్సు, OSSC కోర్సు అభ్యర్థులందరికీ అన్ని అకడమిక్ సబ్జెక్టులు/పేపర్లు సమానంగా ఉంటాయి. విద్యార్థులు తమకు కేటాయించిన సరైన ప్రశ్నపత్రాన్ని (Correct combination) మాత్రమే తీసుకోవాలి. పొరపాటున వేరే ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తే, వారికి మార్కులు కేటాయించారు. విద్యార్థులు కనీసం 30 నిమిషాల ముందే (ఉదయం 9:00 గంటలకు) పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది. సబ్జెక్టును బట్టి పరీక్షా పత్రాలు 100 మార్కులు లేదా 50 మార్కులకు ఉంటాయి.

Continues below advertisement

భాషా సబ్జెక్టులు & గణితం/సోషల్ పేపర్లు 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ (50 మార్కులు), బయోలాజికల్ సైన్స్ (50 మార్కులు) వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. ఫిబ్రవరి నాటికే సిలబస్ పూర్తి చేసి, మార్చి మొదటి వారం వరకు రివిజన్ మరియు మోడల్ పేపర్ల సాధనపై దృష్టి పెట్టండి. హాల్ టికెట్ విడుదలైన వెంటనే దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, అందులో మీ పేరు, ఫోటో, పుట్టిన తేదీ, పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. పరీక్షల మధ్యలో ఉన్న సెలవులను ఆయా సబ్జెక్టుల Revisionకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు.