AP SSC Hall Tickets 2026 | అమరావతి: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న ఏపీ 10వ తరగతి ఎగ్జామ్స్ హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సప్ నెంబర్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చెందిన లీప్‌ యాప్‌లో నుంచి ఏపీ టెన్త్ విద్యార్థులు ఎగ్జామ్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏపీ టెన్త్ క్లాస్ విద్యార్థులు 9552300009 నంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ చేస్తే హాల్‌టికెట్లు పొందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్ ప్రాారం మార్చి పదహారున ప్రారంభమయ్యే ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి.

Continues below advertisement

ఏపీ టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానంవిద్యార్థుల సౌకర్యార్థం అధికారులు హాల్ టికెట్లను పొందేందుకు పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చారు.

అధికారిక వెబ్‌సైట్: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Continues below advertisement

వాట్సప్ సర్వీస్: మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 కు Hi అని మెసేజ్ చేయడం ద్వారా సులభంగా హాల్ టికెట్ పొందవచ్చు.

లీప్ యాప్: పాఠశాల విద్యాశాఖకు చెందిన లీప్ (LEAP) యాప్ ద్వారా కూడా టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.

హాల్ టికెట్‌లో గమనించాల్సిన వివరాలుమీ ఫోటో, సంతకం స్పష్టంగా ఉన్నాయో లేదో చూసుకోండి.

మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ తప్పులు లేకుండా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

పరీక్షా కేంద్రం (Exam Center) అడ్రస్ ముందుగానే తెలుసుకుని, వెళ్లి చేసుకోవాలి. 

పరీక్షల టైమ్ టేబుల్, సబ్జెక్టుల కోడ్‌లు, విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.

విద్యార్థులు చివరి నిమిషంలో హాల్ టికెట్ కోసం టెన్షన్ పడకుండా ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.