AP PGECET 2025: ఏపీ పీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?

PGECET 2025: ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025 నోటిఫికేషన్‌ మార్చి 28న విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.

Continues below advertisement

AP PGECET 2025: ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025(AP PGECET) నోటిఫికేషన్‌ మార్చి 28న విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గేట్‌/జీప్యాట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు వేరుగా నోటిఫికేషన్‌ విడుదలచేస్తారు. 

Continues below advertisement

వివరాలు...

* ఏపీపీజీఈసెట్ - 2025

కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి (పీబీ).

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తుకు అర్హులు. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం  120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. 

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 28.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2025.

➥ పీజీఈసెట్ పరీక్ష తేది: 06.06.2025 - 08.06.2025 వరకు.

పరీక్ష సమయం: మొదటి సెషన్: ఉ.09.00 గం. - ఉ.11.00 గం., రెండో సెషన్: మ. 02.00 గం. . సా.4.00 గం. వరకు.

Continues below advertisement