AP PGCET - 2024 Hallticket Download: ఏపీలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌(AP PGCET)-2024' పరీక్ష హాల్‌టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి జూన్ 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, పరీక్ష పేపరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది పీజీసెట్ ప్రవేశ పరీక్షను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 10 నుంచి 13 వరకు పీజీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 1 గంట నుంచి 2.23 గంటల వరకు రెండో సెషన్‌, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్‌‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పీజీసెట్ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అయితే MEd కోర్సుకు మాత్రం రాతపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తారు.


Download AP PGCET 2024 Halltickets 


ఈ పరీక్ష ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని  17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. మొత్తం మూడు కేటగిరీల పీజీసెట్ వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్‌ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు.


పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మూడు కేటగిరీల వారీగా పీజీసెట్ పరీక్ష  నిర్వహిస్తారు. ఇందులో కేటగిరీ-1 కింద ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్టులకు; కేటగిరీ-2 కింద కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులకు, కేటగిరీ-3 కింద సైన్స్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.



ఆన్సర్ కీ, అభ్యంతరాల స్వీకరణ షెడ్యూలు..
➥ జూన్ 10న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 12న విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై జూన్ 14 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
➥జూన్ 11న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 13న విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై జూన్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 
➥ జూన్ 12న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 14న విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై జూన్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
➥ జూన్ 13న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 15న విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై జూన్ 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
➥ జూన్ 14న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 16న విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై జూన్ 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..