AP KGBV Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన బాలికలకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 352 కేబీవీ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు SMS ద్వారా సమాచారం అందిస్తారు.
ప్రవేశాలు కోరువారు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా ప్రదర్శిస్తారు. అడ్మిషన్ల విషయంలో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే కేజీబీవీ హెల్ప్‌లైన్ నంబర్లు 9494383617 లేదా 9441270099 లేదా 9441214607 లేదా 9490782111 లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:
'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఇక వంద శాతం సిలబస్‌తోనే పదోతరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి పలు ముఖ్యమైన విషయాలను పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే బిట్ పేపర్ (మల్టీపుల్ చాయిస్ ప్రశ్నపత్రం)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అదేవిధంగా జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు మార్చి 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలో ఏప్రిల్‌లో నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసింది. పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 17 వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 23 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..