Trending




AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
AP Inter Board Exam Results 2025 | ఏపీలో నేడు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.

Andhra Pradesh Inter results 2025 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం (ఏప్రిల్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఇంటర్ విద్యార్థులు ఫలితాలను https://telugu.abplive.com//amp లో, https://resultsbie.ap.gov.in సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దాంతో మంత్రి నారా లోకేష్ ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం అవసరం లేదన్నారు. కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చేసే ఖర్చు తగ్గుతుందన్నారు.
వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు
ఇంటర్ విద్యార్థులు ఫలితాలను మన మిత్ర యాప్ నెంబర్ 95523 00009 నెంబర్ కు హాయ్ అని మెస్సేజ్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు అని తెలిపారు. హాయ్ అని మెస్సేజ్ చేశాక, అందులో విద్యాశాఖకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఫలితాలు అనే అప్షన్ తీసుకున్నాక, ఇంటర్ ఫలితాలపై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే మీ ఫలితాలు వచ్చేస్తాయి. రిజల్ట్ డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవాలని విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సూచించారు.
ఈ ఏడాది మొత్తం 1535 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులు పరీక్షలకుగానూ 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు జరిగాయి. మార్చి 1నుండి 19 వరకూ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 3 నుండి 20వ తేదీ వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహించారు.