AP Inter Results 2026 | అమరావతి: నేడు తెలంగాణలో ఇంటర్ ఫలితాల సందడి మొదలవడంతో, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంటర్మీడియట్ విద్యార్థుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ తేదీపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వాల్యుయేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 16వ తేదీ నాటికి ఇంటర్ ఫలితాల విడులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ముగిసే అవకాశం ఉందని సమాచారం.

Continues below advertisement

ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే.. ఏపీ ఇంటర్ బోర్డు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుండి మార్చి 23 వరకు దాదాపు నెలరోజులపాటు ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించి కొన్ని సంస్కరణలు అమలు చేయడం వల్ల పేపర్ల వాల్యుయేషన్‌కు కొంత ఎక్కువ సమయం పట్టిందని, అందుకే ఫలితాలు విడుదల ఇంకా జరగలేదని తెలుస్తోంది. ఒకట్రెండు రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు గానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గానీ  అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Continues below advertisement