Just In





AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Andhra Pradesh Inter Result 2025 | ఏపీలో ఇంటర్మీడియెట్ బోర్డు ఎగ్జామ్స్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

AP inter 2nd year result 2025 | అమరావతి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. శనివారం నాడు ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. రిజల్ట్స్‌ను https://resultsbie.ap.gov.in సైట్‌లో, మన మిత్ర యాప్ 95523 00009 నెంబర్ కు హాయ్ అని మెస్సేజ్ చేసి చెక్ చేసుకోవాలని సూచించారు.
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఏపీలో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగాయి. మార్చి 1నుండి 19 వరకూ ఫస్టియర్ పరీక్షలు, 3 నుండి 20వ తేదీ వరకూ సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాల ఎగ్జామ్ రోజు ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటికి సంబంధించిన ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 3 నుంచి 15వ వరకు జరిగాయి. 325 కేంద్రాల్లో మొత్తం 67వేల 952 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి.
- Inter విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bieap.gov.in లేదా resultsbie.ap.gov.in ను సందర్శించాలి.
- 1వ లేదా 2వ సంవత్సరం ఇంటర్ ఫలితాల కోసం లింక్‌పై క్లిక్ చేయాలి
- లాగిన్ వద్ద విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి
- వారు వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తే స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.
- భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు ఆ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.