AP Inter Results 2023 Schedule Change: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి. హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త ఆలస్యంగా విజయవాడకు చేరుకోనున్నారు. దాంతో బుధవారం సాయంత్రం 5 గంటలకు బదులు 6 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేయనున్నారు.



ఏపీ ఇంటర్ ఫలితాలు (AP Inter Results 2023) విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. సాయంత్రం ఆరు గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెగ్యూలర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డ్ విడుదల చేయనుంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజ‌రయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్‌, 83,749 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.


ఫలితాలు ఇలా చూసుకోండి...


స్టెప్-1: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏప్రిల్ 26న సాయంత్రం 5.00 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. 


స్టెప్-2: ఇంటర్ ఫలితాలు విడుదల కాగానే అభ్యర్థులు https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in వెబ్‌సైట్లను సందర్శించాలి.


స్టెప్-3: తర్వాత ఆయా వెబ్‌సైట్‌లోని హోంపేజీలో ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.


స్టెప్-4: ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 


స్టెప్-5: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేయాలి. 


స్టెప్-5: తర్వాత 'SUBMIT' బటన్‌ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.


స్టెప్-6: ఫలితాల కాపీని ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.


ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html/amp


ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయ‌ర్ గాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించింది. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్‌ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి.


ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజ‌రయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489  కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్‌, 83,749 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.


ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..


https://examresults.ap.nic.in


www.bie.ap.gov.in  


 


ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://telugu.abplive.com/exam-results/ap-board-result-62b2b1aa8d556.html/amp


ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html/amp