AP Inter Hall Ticket Download WhatsApp : వాట్సప్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP Inter Hall Tickets In WhatsApp: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ హాల్‌టికెట్లను విడుదల చేసింది.

Continues below advertisement

How Can Download Inter Hall Tickets In Whatsapp: ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సాప్‌ ద్వారా అందించేందుకు నిర్ణయించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులు వాట్సాప్‌ ద్వారా ఫిబ్రవరి 7 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. విద్యార్థులు వాట్సప్‌ నంబరు 95523 00009 ద్వారా వారంతా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏపీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 

Continues below advertisement

ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..
ఏపీలో ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఇంటర్ ఫస్టియర్ హాల్‌టికెట్ నెంబరు లేదా ఆధార్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనరల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు, ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. 

ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి హాల్‌టికెట్లు కూడా..?
ఇప్పటికే వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంటర్ విద్యార్థుల సౌలభ్యం కోసం హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే తరహాలో త్వరలో పదోతరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. 

మార్చి 1 నుంచి థియరీ పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2025 మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 13తో ముగియనున్నాయి. అదేవిధంగా మార్చి 3 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 15తో ముగియనుండగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 20తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 1- శనివారం -  సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 4 - మంగళవారం - ఇంగ్లిష్ పేపర్-1

➥ మార్చి 6 - గురువారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

➥ మార్చి 8 - శనివారం - మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

➥ మార్చి 11 - మంగళవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

➥ మార్చి 13 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1

➥ మార్చి 17 - సోమవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ మార్చి 19 - బుధవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 3 - సోమవారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2

➥ మార్చి 5 - బుధవారం - ఇంగ్లిష్‌ పేపర్-2

➥ మార్చి 7 - శుక్రవారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ-2, సివిక్స్-2.

➥ మార్చి 10 -  సోమవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.

➥ మార్చి 12 - బుధవారం - ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.

➥ మార్చి 15 - శనివారం - కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2

➥ మార్చి 18 - మంగళవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ మార్చి 20  - గురువారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

Also Read: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూలు ఇదే - ఎగ్జామ్స్ తేదీలివే

Continues below advertisement