ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మంగళవారం (మే 16న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రశీదు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు ఇలా చూసుకోండి..
స్టెప్-1: ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.-https://bie.ap.gov.in/
స్టెప్-2: తర్వాత అక్కడ హోంపేజీలో కనిపించే 'Recounting(RC)& Reverification(RV) Results' ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్-3: ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-4: లాగిన్ పేజీలో అభ్యర్థులు విద్యార్థులు తమ రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రశీదు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
స్టెప్-5: తర్వాత 'Results' బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.
స్టెప్-6: ఫలితాల కాపీని ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయర్‌కు గాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించింది. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
Also Read:
ఎంసెట్ ఇంజినీరింగ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణలో మే 12,13,14 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని మే 15న సాయంత్రం విడుదల చేశారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 15న సాయంత్రం 8 గంటల నుంచి మే 17న సాయంత్రం 8 గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి వెబ్ లింక్ ద్వారా తెలియజేయవచ్చు.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..