ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 13న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శేషగిరి బాబు ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి మొత్తం 39.6 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీకౌంటింగ్, స్కానింగ్ కాపీతోపాటు రీవెరిఫికేషన్‌కు జూన్ 23 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించారు. కేవలం 12 రోజుల్లోనే ఫలితాలు ఇవ్వడం విశేషం.
గత మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిలో 2,51,653 మంది పరీక్ష రాయగా.. వారిలో 99,698 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే సగం కూడా ఉత్తీర్ణులు అవలేదు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 37.77% మంది ఉత్తీర్ణులు కాగా.. ద్వితీయ సంవత్సరంలో 42.36% మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కలిపి మొదటి ఏడాదిలో బాలురు 74.34 శాతం, బాలికలు 80.56 శాతం, రెండో ఏడాదిలో బాలురు 81.99 శాతం, బాలికలు 86.46 శాతం మంది ఉత్తీర్ణ సాధించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇక మొదటి సంవత్సరం విద్యార్థుల ఇంప్రూవ్‌మెంట్ మార్కులకు సంబంధించి.. 1,69,347 పరీక్షలు రాయగా, ఇందులో 1,41,733 అంటే 83 శాతం మంది విద్యార్థులకు మార్కులు పెరగడం విశేషం. గతంలో ఫెయిలై ఇప్పుడు రెండో ఏడాది పరీక్ష రాసిన వారిలో 37.22 శాతం విద్యార్థఉలు పాసయ్యారు.
మొదటి ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. వైఎస్సార్ కడప జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రెండో ఏడాదిలో పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. వైఎస్సార్ కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ మార్చితోపాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో సీఎం సొంత జిల్లా వైఎస్సార్ జిల్లా 63.32 శాతం అట్టడుగున నిలిచిన సంగతి తెలిసిందే. రెండో ఏడాదిలోనూ 75.95 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మొదటి ఏడాదిలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరం మొదటి ఏడాదిలో 66.57 శాతంతో కింద నుంచి రెండో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 80.76 శాతంతో 8వ స్థానంతో సరిపెట్టుకుంది.
Also Read:
నీట్ యూజీ ఫలితాలు వెల్లడి, తెలుగు విద్యార్థికి తొలి ర్యాంక్!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ-2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 13న రాత్రి ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అవసరమైన వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.నీట్ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో సత్తా చాటాడు. నీట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి 99.99 పర్సంటైల్‌తో అదరగొట్టారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది.
నీట్ యూజీ ఫలితాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..