AP Inter 2nd Year Results 2026 | ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయ్. తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో బుధవారం ఉదయం ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్  https://resultsbie.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.  ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించింది.

Continues below advertisement

ఈ ఏడాది ఇంటర్‌  పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లతో పోల్చితే పెరిగింది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు  5, 26, 264 మంది ఉన్నారు. ఈ మొత్తంలో జనరల్‌ స్ట్రీమ్‌, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు కూడా  ఉన్నారు. 

Continues below advertisement

సెకండియర్‌లోనూ బాలికలదే పైచేయి..

ఏపీ ఇంటర్ సెకండియల్ 505609 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జనరల్ విభాగంలో 446537 మంది, వొకేషనల్ విభాగంలో 33852 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో  జనరల్ విభాగంలో బాలికలు 85 శాతం, బాలురు 76 శాతం పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో బాలికలు 83 శాతం, బాలురు 62 శాతం మంది పాసయ్యారు.

మీరు ఫోన్‌ నుంచి 9552300009 నెంబర్‌ కు వాట్సాప్ లో హాయ్ అని మెస్సేజ్ చేసి రిజల్ట్స్ చేక్ చేసుకోవచ్చు. Hi అని మెస్సేజ్ తరువాత వచ్చే సూచనల ప్రకారం మీ హాల్‌టికెట్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే సెకన్‌లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు - జిల్లా వారీగా

 జిల్లాహాజరైన వారుఉత్తీర్ణులైన వారుపాస్ శాతం (%)
1కృష్ణా21,66919,95292
2గుంటూరు30,55126,85688
3ఎన్టీఆర్36,15131,45387
4పార్వతీపురం మన్యం5,8795,09787
5అల్లూరి సీతారామరాజు5,3704,60386
6తూర్పు గోదావరి18,33715,70786
7విశాఖపట్నం37,42232,03486
8కర్నూలు18,89916,07785
9ఎస్పీఎస్ఆర్ నెల్లూరు24,14119,77182
10ఏలూరు14,03611,29880
11తిరుపతి27,79022,34480
12పశ్చిమ గోదావరి15,55712,41480
13అనకాపల్లి9,9267,82979
14పల్నాడు14,38111,11477
15అనంతపురము20,32015,53076
16డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ9,5417,25876
17ప్రకాశం16,84212,78776
18విజయనగరం16,45612,45676
19నంద్యాల12,3009,30676
20కాకినాడ17,96313,48575
21బాపట్ల8,3586,25275
22శ్రీ సత్యసాయి9,9147,37874
23శ్రీకాకుళం17,35512,68473
24చిత్తూరు11,6518,28071
25వైఎస్ఆర్ కడప13,8969,87071
26అన్నమయ్య11,8327,98167
మొత్తంTOTAL4,46,5373,59,81681

అత్యధిక ఉత్తీర్ణత సాధించిన మొదటి 5 జిల్లాలు

రాష్ట్రవ్యాప్త ఫలితాలలో కృష్ణా జిల్లా 92 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (88 శాతం), ఎన్టీఆర్ జిల్లా (87 శాతం) నిలిచాయి. గిరిజన ప్రాంతాలైన పార్వతీపురం మన్యం (87 శాతం), అల్లూరి సీతారామరాజు (86 శాతం) జిల్లాలు కూడా అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి ఐదు స్థానాల్లో నిలవడం విశేషం.

అల్ప ఉత్తీర్ణత నమోదైన చివరి 5 జిల్లాలు

ఈ ఫలితాలలో అన్నమయ్య జిల్లా 67 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. దీనికంటే కొంచెం మెరుగ్గా వైఎస్ఆర్ కడప మరియు చిత్తూరు జిల్లాలు చెరో 71 శాతంతో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా 73 శాతం ఉత్తీర్ణత సాధించగా, శ్రీ సత్యసాయి జిల్లా 74 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ జిల్లాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత (81 శాతం) కంటే తక్కువ ఫలితాలను నమోదు చేశాయి.