ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఐసెట్-2023 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 8 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులకు సెప్టెంబరు 9 - 16 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సెప్టెంబరు 12న అర్హత పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబరు 19 నుంచి 21 వరకు కొనసాగనుంది. సెప్టెంబరు 22న వెబ్ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇచ్చి, సెప్టెంబరు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకాన్నాయి.
ఐసెట్ షెడ్యూలు ఇలా..
✦ సెప్టెంబరు 8 నుంచి 14 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
✦ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి సెప్టెంబరు 9 నుంచి 16 మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
✦ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థులు సెప్టెంబరు 19 నుంచి 21 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
✦ అభ్యర్థులు సెప్టెంబరు 22న వెబ్ ఆప్షన్లలో ఏమైనా మార్పులు ఉంటే సరిచేసుకోవచ్చు.
✦ సెప్టెంబరు 25న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.
✦ సీట్లు పొందినవారు సెప్టెంబరు 26లోగా సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
✦ సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
సెప్టెంబరు 8 నుంచి 14 వరకు |
రిజిస్ట్రేషన్ |
సెప్టెంబరు 9 నుంచి 16 వరకు | సర్టిఫికేట్ వెరిఫికేషన్ |
సెప్టెంబరు 19 నుంచి 21 వరకు | వెబ్‌ఆప్షన్లు |
సెప్టెంబరు 22న | వెబ్ఆప్షన్ల మార్పు |
సెప్టెంబరు 25న | సీట్ల కేటాయింపు |
సెప్టెంబరు 26లోగా | కాలేజీలో రిపోర్టింగ్ |
తరగతులు ప్రారంభం | సెప్టెంబరు 27 నుంచి |
AP ICET 2023 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
✦ AP ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, https://icet-sche.aptonline.in/ వెళ్లాలి.
✦ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
✦ రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.
✦ అవసరమైన వివరాలను నింపాలి.
✦ బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంచుకోవాలి.
✦ ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.
✦ సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.
కావాల్సిన డాక్యుమెంట్లు..
- ఏపీ ఐసెట్ 2023 హాల్‌టికెట్
- ఏపీ ఐసెట్ 2023 ర్యాంకు కార్డు
- ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
- డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్
- ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల మెమో
- పదోతరగతి మార్కుల మెమో
- 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు
- రెసిడెన్స్ సర్టిఫికేట్
- ఇన్‌కమ్ సర్టిఫికేట్
- కులధ్రువీకరణ సర్టిఫికేట్
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
- లోకల్ సర్టిఫికేట్
- NCC/CAP, మైనార్టీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.
ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్(AP ICET)-2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 49,162 మంది దరఖాస్తు చేసుకోగా.. 44 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 8 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.