ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఏప్రిల్ 19తో ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసముతో దరఖాస్తుకు మే 15 వరకు అవకాశం కల్పించారు.


అభ్యర్థులు రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 4 నుంచి మే 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 11 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


మే 16, 17 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24, 25 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  


వివరాలు..


* ఏపీ ఐసెట్-2023 


కోర్సుల వివరాలు..


1) ఎంసీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.


2) ఎంబీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.


వయోపరిమితి: 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లిస్తే సరిపోతుంది. 


పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).


ఏపీ ఐసెట్-2023 ముఖ్యమైన తేదీలు: 


➽ ఏపీఐసెట్-2023  నోటిఫికేషన్:  మార్చి 17న 


➽ దరఖాస్తులు స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు. 


➽ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 20 నుంచి 26 వరకు. 


➽ రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు. 


➽ రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: మే 4 నుంచి 10 వరకు. 


➽ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: మే 11 నుంచి 15 వరకు. 


➽ పరీక్ష హాల్‌టికెట్లు: మే 20 నుంచి అందుబాటులో. 


➽ ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: మే 24, 25 తేదీల్లో.


Notification


Online Application


Also Read:


TS ICET 2023: టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఐసెట్-2023' దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి  మే 6 వరకు కొనసాగనుంది.  విద్యార్థులు రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం కల్పించనున్నారు. మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు.  
ఐసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..