ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిప్రకారం మే 1 నుంచి వేసవి సెలువులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరానికి గానూ చివరి వర్కింగ్ ఏప్రిల్ 30వ తేదీగా పేర్కొన్నారు. చివరి రోజు విద్యార్ధులు, తల్లిదండ్రులతో మీటింగ్ (పీటీఎం) నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేసింది.



Also Read:


వేసవి సెలవుల్లోనూ క్లాసులు, ఇంటర్ బోర్డు ఆదేశాలు బేఖాతరు!
ఏపీలో ఒకవైపు ఇంటర్మీడియట్‌ కళాశాలలను జూన్‌ ఒకటి వరకు ప్రారంభించొద్దని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్‌ విద్యామండలి ఆదేశించింది. ప్రవేశాలను సైతం నిర్వహించొద్దని సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు కార్పొరేట్‌ కాలేజీలు ఇవేమీ పట్టడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుండే అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. వాస్తవానికి ఫిబ్రవరి నుండే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలకు పోటీపడేవారు కార్పొరేట్‌ కాలేజీల్లో ముందే ప్రవేశాలు తీసుకుంటున్నారు. ముందుగా రూ.10,000 ఫీజు కట్టి అడ్మిషన్‌ ఖరారు చేసుకుంటున్నారు. నిబంధనలు పేరుకే ఉన్నాయి కానీ కార్పొరేట్‌ కాలేజీలకు కళ్లెం వేయలేకపోతున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్‌-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ & ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్‌ & డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2023' నోటిఫికేషన్‌‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - వచ్చేవారంలో 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు మరోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://cbse.gov.in, results.cbse.nic.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్‌ వివరాలను విద్యార్థులు తమకు అందుబాటులో ఉంచుకోవాలి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..