అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఎడ్‌సెట్-2026' (EdCET-2026) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ ఏడాది చిత్తూరు జిల్లాలోని ద్రావిడియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 8వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Continues below advertisement

ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు జరుగుతుంది. ఇక రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ అభ్యర్థుల కోసం నిర్వహించనున్నారు.

 రేపే ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్.. వాట్సాప్‌లో కూడా చూసుకోవచ్చు!ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు రేపటితో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30 న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే రిజల్ట్స్ పనులను పూర్తి చేసింది.

Continues below advertisement

ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్లు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు తమ మార్కులను తెలుసుకోవడానికి ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.అధికారిక వెబ్‌సైట్లు: విద్యార్థులు https://results.bse.ap.gov.in/ లేదా https://telugu.abplive.com/ వెబ్‌సైట్‌ల ద్వారా ఫలితాలను పొందవచ్చు.

వాట్సాప్ (మనమిత్ర): సర్వర్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందిస్తున్నారు.

9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపాలి.

అక్కడ వచ్చే సూచనల ప్రకారం మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.

వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వీటిని పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోవడం భవిష్యత్ అవసరాలకు మంచిది.