ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 20న ఏపీఈసెట్‌-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జేఎన్‌టీయూకే ఉపకులపతి, ఏపీఈసెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు ఆదివారం (జూన్ 18) ఒక ప్రకటలో తెలిపారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికోసం 101 పరీక్ష కేంద్రాలు కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు.


ఏపీఈసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


జూన్ 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో ఏపీఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 23న ప్రాథమిక కీ విడుదల చేసి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. జులై మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఇందులో ర్యాంకులు సాధించిన వారు బి.ఇ, బి.టెక్, బి.ఫార్మసీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందుతారని ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు.


పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి. 



ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2023 నోటిఫికేషన్‌ మార్చి 8న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభంకాగా.. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 11 నుంచి 15 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 12న విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 20న ఈసెట్ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని జూన్ 23న విడుదల చేసి, జూన్ 25 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. తదనంతరం ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా విడుల చేస్తారు.


ఏపీఈసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..