AP ECET Key 2022: జేఎన్‌టీయూ - కాకినాడ (JNTUK) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌ 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ పేపర్ ను కన్వీనర్ ఎ. కృష్ణ మోహన్ నిన్న విడుదల చేశారు. అయితే ఈ కీ పేపర్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 26వ తేదీ అంటే రేపటి వరకు స్వీకరిస్తామని వివరించారు. ఏపీ ఈసెట్ ఫలితాలను ఆగస్టు 6వ తేదీన ప్రకటించబోతున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ప్రాథమిక ఆన్సర్‌ కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


మొత్తం 17,180 మంది మాత్రమే హాజరు..


అయితే ఏపీ ఈసెట్ కు సంబంధించిన పరీక్షను ఉదయం 18 వేల 318 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ పరీక్షకు మాత్రం 17 వేల 180 మంది మాత్రమే హాజరు అయినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం పరీక్షకు 20 వేల 423 మంది విద్యార్థులు దరఖాస్తు చేుసుకున్నారు.  కానీ పరీక్ష రాసింది మాత్రం 19 వేల 238 మంది పరీక్ష రాశారని అధికారులు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు మొత్తంగా 38 వేల 741 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో పరీక్ష రాసింది 36 వేల 418 మంది మాత్రమే. అంటే మొత్తంగా 94 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయినట్లు అధికారులు వెల్లడించారు.


ఏపీ ఈసెట్ కీ పీపర్ డౌన్ లోడ్ ఇలా..


AP ECET 2022 ఆన్సర్ కీకి వ్యతిరేకంగా విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అభ్యంతరాలను లేవనెత్తడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌ సైట్‌ ను సందర్శించి, AP ECET 2022 ఆన్సర్ కీ ఛాలెంజ్ లింక్‌ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అధికారులు అన్ని సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది AP ECET ఆన్సర్ కీ 2022ని విడుదల చేస్తారు. అలాగే, AP ECET 2022 ఫలితం తుది జవాబు కీ ఆధారంగా మాత్రమే తయారు చేయబడుతుంది.


జూలై 29న ఫలితాల వెల్లడి..


ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు జులై 29న విడుదుల కానున్నాయి. ఈ ఫలితాలు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురంలో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ విడుదలైన విషయం తెలిసిందే. తమకు ఎంత మార్కులు వస్తాయనేదానిపై చాలా మందికి ఓ అవగాహన ఉండే ఉంటుంది. అందుకు కారణం.. ఈ కీ పేపరే.