AP EAPCET 2024 Results Toppers List: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు మంగళవారం (జూన్ 11న) విడుదలయ్యాయి. విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామమోహన్ రావు ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. 


ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించి మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది. 


ఏపీ ఎప్‌సెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఇంజినీరింగ్, ఫార్మసీ టాపర్లు వీరే..


1వ ర్యాంకు: మాకినేని జిష్ణు సాయి - గుంటూరు


2వ ర్యాంకు: మురసాని సాయి యశ్వంత్ రెడ్డి - కర్నూలు


3వ ర్యాంకు: భోగాలపల్లి సందేశ్ - కర్నూలు


4వ ర్యాంకు: పలగిరి సతీష్ రెడ్డి - అనంతపురం


5వ ర్యాంకు: కోమటినేని మనీష్ చౌదరి - గుంటూరు


6వ ర్యాంకు: ఎప్ప లక్ష్మీ నరసింహరెడ్డి - సిద్ధిపేట, తెలంగాణ


7వ ర్యాంకు: గొల్ల లేఖ హర్ష - కర్నూలు


8వ ర్యాంకు: పుట్టి కుశాల్ కుమార్ - అనంతపురం


9వ ర్యాంకు: పి సుశాంత్ - హనుమకొండ, తెలంగాణ


10వ ర్యాంకు: కొమిరిసెట్టి ప్రభాస్ - ప్రకాశం     



అగ్రికల్చర్, ఫార్మసీ టాపర్లు..


1వ ర్యాంకు: యెల్లు శ్రీశాంత్ రెడ్డి - హైదరాబాద్


2వ ర్యాంకు: పూల దివ్యతేజ - సత్యసాయి జిల్లా


3వ ర్యాంకు: వడ్డపూడి ముకేశ్ చౌదరి - తిరుపతి


4వ ర్యాంకు: పేర సాత్విక్- చిత్తూరు


5వ ర్యాంకు: ఆలూరు ప్రణీత - అన్నమయ్య జిల్లా


6వ ర్యాంకు: గట్టు భానుతేజ సాయి - అనంతపురం


7వ ర్యాంకు: పెన్నమడ నిహారిక రెడ్డి - హైదరాబాద్


8వ ర్యాంకు: సంబంగి మనో అభిరామ్ - విశాఖపట్నం 


9వ ర్యాంకు: ఎస్ పావని - విశాఖపట్నం 


10వ ర్యాంకు: నాగుదాసరి రాధాక్రిష్ణ - పార్వతీపురం



ఈ ఏడాది ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. ఇందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.


అయితే మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మే 25న వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇక మే 24న ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో తాజాగా ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.   



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..