ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ ఈఏపీసెట్, ఈసెట్, లాసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ నోటిఫకేషన్లను ప్రకటించింది. ఈ కోర్సుల దరఖాస్తు గడువు ఎప్పటితో ముగియనుంది.. ప్రవేశ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు వంటి అంశాలపై కథనం..


ఏపీ ఈఏపీసెట్ (పాత ఎంసెట్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) -2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను జేఎన్టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది. 
ఈఏపీసెట్ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు.  
పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు, 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 25, 2021
వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in
ఏపీ ఈసెట్ (AP ECET)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఈసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లమో హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్) - 2021 పరీక్ష నిర్వహిస్తారు. ఈసెట్ పరీక్షను సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఏపీ ఈసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (APSCHE) తరఫున అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తోంది. 
దరఖాస్తుల స్వీకరణ గడువు: ఆగస్టు 12, 2021
పరీక్ష నిర్వహణ తేదీలు: సెప్టెంబర్ 19, 2021
వెబ్‌సైట్‌: http://www.sche.ap.gov.in/ecet 
ఏపీ ఐసెట్ (AP ICET)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్ - 2021 (ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (APSCHE) తరఫున విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 
దరఖాస్తుల స్వీకరణ గడువు: ఆగస్టు 14, 2021
పరీక్ష నిర్వహణ తేదీలు: సెప్టెంబర్ 17, 18 
వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/icet 
ఏపీ లాసెట్, పీజీ లాసెట్ (AP LAWCET, PGLAWCET)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2021- 22 విద్యా సంవత్సరంలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లాసెట్ పరీక్షను నిర్వహిస్తుంది. లాసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ చంద్రకళను నియమించారు.
పరీక్ష నిర్వహణ తేదీ: సెప్టెంబర్ 22, 2021
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 20, 2021
వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/lawcet
ఏపీ పీజీఈసెట్ (AP PGECET)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీ ఈసెట్ పరీక్షలను సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. పీజీ ఈసెట్ పరీక్షలను తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పీజీ ఈసెట్ ప్రొపెసర్ ఆర్.సత్యనారాయణను నియమించింది.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 19, 2021
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు, 2021
వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/PGECET 
ఏపీ ఎడ్‌సెట్  (AP EDCET)
ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్‌సెట్ ) - 2021 పరీక్షను నిర్వహిస్తారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ వెంకటేశ్వరరావును నియమించింది.  
దరఖాస్తులకు ఆఖరి తేది: ఆగస్టు 17, 2021
పరీక్ష తేది: సెప్టెంబర్ 19, 2021
వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/EDCET/