AP EAMCET: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్  ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ AP EAMCET ( AP EAPCET) ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్ కేటాయింపు ఫలితాలు   ఇవాళ (జులై 22) విడుదల కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి (Andhra Prasdesh State Council of Higher Education)-APSCHE ఫలితాలను విడుదల చేయనుంది.  అధికారిక వెబ్‌సైట్ (https://eapcet-sche.aptonline.in) ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం AP EAPCET ప్రవేశ పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. విద్యార్థులు వెబ్ ఆప్షన్ ద్వారా కళాశాలల ఎంపిక పూర్తి చేశారు. వారి ర్యాంకుల ఆధారంగా కళాశాలల్లో సీట్లను కేటాయించనున్నారు. ఆ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. 

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ వివరాలు:

* ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ జూలై 7న ప్రారంభమై జూలై 16 వరకు కొనసాగింది.* డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై 7 నుంచి 17 వరకు చేశారు.* వెబ్ ఆప్షన్లు జూలై 13 నుండి 18 వరకు అందుబాటులో ఉన్నాయి.* సీట్ల కేటాయింపు జూలై 22న చేశారు. * అభ్యర్థులకు సీట్లు కేటాయించిన తర్వాత జూలై 23 నుండి 25 మధ్య రిపోర్టింగ్ ఉండే అవకాశం ఉంది.

ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా? How to Check Seat Allotment

1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి: https://eapcet-sche.aptonline.in/EAPCET/2. "Seat Allotment Result – Phase 1" అనే లింక్‌పై క్లిక్ చేయండి.3. హాల్ టికెట్ నంబర్ ,పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.4. మీ సీటు కేటాయింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోండి.

రిపోర్టింగ్‌కోసం అవసరమైన డాక్యుమెంట్లు

* హాల్‑టికెట్ & ర్యాంక్ కార్డ్* ఇంటర్ మార్క్స్ & TC* SSC - DOB* డొమిసైల్ సర్టిఫికెట్* ఏడేళ్ల చదువుకు సంబంధించి రెసిడెంట్ ప్రూఫ్ * ఆదాయ ధృవపత్రం (ఇంటర్లో లేదా ఫీజు రియింబర్స్ కోసం)* లోకల్ స్టేటస్ సర్టిఫికెట్* EWSసర్టిఫికెట్ ( అవసరమైన వారికి)

ఆ తర్వాత ఏం చేయాలంటే..

ఫేజ్-1లో సీటు పొందిన అభ్యర్థులు నిర్దిష్ట కాలేజీకి రిపోర్ట్ కావాలి. ఈనెల 23 నుంచి 25 వరకూ రిపోర్టింగ్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఫేజ్-2 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫేజ్-2కి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

సీట్లు ఎంతమందికి అంటే..ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో చేరడానికి మొత్తం 1,43,254 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో  138,972 సీట్లు ప్రైవేట్‌లో ఉన్నాయి.  మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్, యూనివర్సిటీ కాలేజీలు ఇలా మత్తం 1652 సంస్థలు ఈ సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. BTech, Bsc Agriculture, BPharm,BSC Fisheries, BArc కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.