ఏపీ ఈఏపీసెట్‌ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో సడలింపు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈఏపీసెట్‌ ద్వారా కౌన్సెలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్‌ చదువులు సాధారణంగా కొనసాగడంతో ఇంజినీరింగ్‌, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలో కనీస మార్కులను ప్రభుత్వం సడలించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే అమలులో ఉంటాయి. ఈ సడలింపు ఆధారంగా జనరల్ క్యాటగిరీలోని అభ్యర్థులు ఇంజినీరింగ్ లేదా ఫార్మసీ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు అర్హులుగా పరిగణించేందుకు ఇంటర్ 1, 2 వ సంవత్సరం పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులను పొందవలసి ఉంటుంది. రిజర్వ్‌డ్ క్యాటగిరీల్లోని విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం 40 శాతంగా ఉండాలి.


ప్రకటన ఇలా...
"All the candidates are informed that minimum marks in the qualifying examination intermediate or equivalent for admissions into professional UG courses in engineering and pharma D courses have been relaxed as one-time measure for the academic year 2022-2023 as per the orders received from the government of higher education (EC) Department”.


 


అయితే, ఈ నిబంధన ప్రకారం అన్ని సబ్జెక్టుల్లోని మార్కులను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇంటర్‌లో సాధారణ అభ్యర్థులు 45 శాతం మార్కులతో, పీసీఎంలో రిజర్వ్‌ చేయబడిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఈఏపీసెట్‌లో పాసైన వారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. సవరించిన ప్రమాణం ప్రకారం, విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల్లో పీసీఎంలో మొత్తం 45 శాతం స్కోర్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్‌ 1, 2 వ ఏడాది పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.



Also Read:


Engineering Fees Hike : విద్యార్థులకు షాక్, భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు!
విద్యార్థులకు ఫీజుల షాక్ తగిలింది. ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. అయితే పెంచిన ఫీజులపై జీవో ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభకానుంది. పెంచిన ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని 79 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఏఎఫ్ఆర్సీ వద్ద అంగీకరించిన ఇంజినీరింగ్ ఫీజులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెంచిన ఫీజులతో రాష్ట్రంలో 36 ఇంజినీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.లక్ష దాటనుంది. సీబీఐటీలో రూ.1.73 లక్షలు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీలో వార్షిక ఫీజు రూ.1.55 లక్షలకు చేరింది. శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోజి రూ.1.50 లక్షలు, ఎంవీఎస్ఆర్ రూ.1.45 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.  పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది. బీసీ, ఈబీసీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పెంపు ప్రతిపాదనలపై  ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. రేపు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈనెల 13 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉంది
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...


 


Also Read:


UOH PhD: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2022 -23 ఏడాదికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 42 కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 281 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 99 సీట్లు, ఎస్సీ అభ్యర్థులకు 43 సీట్లు, ఎస్టీ అభ్యర్థులకు 21 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 76 సీట్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సీట్లు, దివ్యాంగులకు 14 సీట్లు కేటాయించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..