Dasara Holidays for Schools in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ దసరా పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. అక్టోబర్ 10వ తేదీన రెండో శనివారం, 11వ తేదీన ఆదివారం కావడంతో విద్యార్థులకు 2 రోజుల ముందుగానే.. అంటే 10వ తేదీ నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

Continues below advertisement

దసరా శరన్నవరాత్రుల వేడుకల సందర్భంగా విద్యార్థులకు కొన్ని రోజుల సెలవులు లభించనున్నాయి. మొత్తంగా 12 రోజుల పాటు సెలవుల విరామం అనంతరం, ఈ నెల 22వ తేదీన పాఠశాలలు మళ్లీ పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.  కాగా, క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూళ్లకు క్రిస్మస్ సెలవుల ఉంటాయి కనుక ఇలాంటి స్కూళ్లకు దసరా సెలవుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు మాత్రమే కాదు, టీచర్లు సైతం తమ కుటుంబసభ్యులతో పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు అధికారులు.

ఇంటర్ కాలేజీలకు సైతం బోర్డ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 10 నుంచి 20 వరకు దసరా సెలవులు ఉంటాయి. అంతకుముందే క్వార్టర్లీ ఎగ్జామ్స్ కాలేజీలు నిర్వహించనున్నాయి. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 21న జూనియర్ కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. నవంబరు 25 నుంచి 30 వరకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ తరువాత వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి కూడా ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయని తెలిసిందే.

Continues below advertisement