Andhra Pradesh Fisheries University BFSc Admissions: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ) క్యాంప్ ఆఫీస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్యరుసుముతో ఆగస్టు 9 వరకు దరఖాస్తుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఆలస్యరుసుము కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
కోర్సు వివరాలు..
* బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ)
కళాశాల, సీట్ల వివరాలు..
➦ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు (ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా): 40 సీట్లు
➦ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): 60 సీట్లు
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు)
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్
అర్హత: ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్ 2023 ర్యాంక్ సాధించి ఉండాలి.
వయోపరిమితి..
* 31.12.2024 నాటికి 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 31.12.2007 - 31.12.2002 మధ్య జన్మించి ఉండాలి.
* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు 31.12.2007 - 31.12.1999 మధ్య జన్మించి ఉండాలి.
* దివ్యాంగులైతే 27 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు 31.12.2007 - 31.12.1997 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఆలస్యరుసుము కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ప్రవేశ సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు..
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత మార్కుల మెమో, పాస్ సర్టిఫికేట్
➥ AP EAPCET 2024 హాల్‌టికెట్
➥ AP EAPCET 2024 ర్యాంకు కార్డు
➥ పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష సర్టిఫికేట్
➥ కమ్యూనిటీ/క్యాస్ట్ సర్టిఫికేట్ (బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు)
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
➥ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సంబంధించిన సర్టిఫికేట్లు
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (చివరగా చదివిన కాలేజీ/స్కూల్ నుంచి)
➥ ఫార్మర్స్ కోటా కింద చేరేవారు ఫారమ్-I, ఫారమ్-II సమర్పించాలి.
➥ ఒరిజినల్ పట్టాదార్ పాస్‌బుక్ లేదా అడంగల్/1B సమర్పించాలి.
➥ స్పెషల్ కేటగిరీ (CAP/NCC/PH/స్పోర్ట్స్ & గేమ్స్, స్కౌట్స్ & గైడ్స్) కింద ప్రవేశాలు కోరేవారు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 07.08.2024.
➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2024.